amazon-3

Thursday, October 7, 2010

వెంట్రుకలు ఊడకుండ ఉండేందుకు ఆయుర్వేద షాంపు

కూకుడుకాయల  పొడి -100 g.
శీకాకాయ    పొడి - 100g.
ఉసిరికాయల పొడి  - 100g
మారేడు పండ్ల గుజ్జు పొడి - 100g
ఫై పొడులన్నీ బాగా కలిపి నిల్వచేసుకోవాలి.
గ్లాసు వేడి నీటిలో 6 స్పూన్ల పొడిని,ఒక నిమ్మకాయ రసంను వేసి బాగా కలిపి రాత్రంతా నానబెట్టి ఉదయం తల స్నానం చేయాలి.
ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేయాలి.ఏడు సార్లు చేసేటప్పటికి వెంట్రుకలు గట్టి పడి ఊడకుండ ఉంటాయి.
నువ్వుల ఉండలు,నువ్వుల పొడి,నువ్వులు ఆహారంలో  తీసుకోవడం వల్ల వెంట్రుకలు ఊడకుండ బాగా పెరుగుతాయి.

ఆయుర్వేద పద్ధతిలో ఫ్లోరైడ్ నీటిని తాగే నీటిగా మార్చుకోవడం

చిల్లగింజలు ( నిర్మలగింజలు) నీటితో సాది గంధం తీయాలి.నీటిని కాచి చలార్చి ఫై ఫై నీటిని వేరొక పాత్రలోకి వంచుకుని చిటికెడు చిల్లగింజల  గంధం,ఒకముక్క అతిమధురం వేసి 3 గంటల తరువాత ఫై ఫై నీటిని వడబోసుకుని తాగవచ్చు.ఇలా చేయడం వల్ల  ఫ్లోరైడ్ నీటిని తాగే నీటిగా మార్చుకోవచ్చును .

అరికాళ్ళ మంటల నివారణకు వ్యాయామం,ఆహార నియమాలు, పాదాలలో వచ్చే ఆనెలకు సౌందర్య కానుక

అరికాళ్ళ మంటల నివారణకు వ్యాయామం:
1 ) ఆముదం లేదా కొబ్బరినూనె  లేదా నెయ్యి వీటిలో ఏదో ఒకటి తగినంత తీసుకుని వేడిచేసి అరికాలికి మర్దన చేసి రెండు బొటన వేళ్ళతో గుచ్చినట్లు press చేయాలి.
2 ) కుర్చీ ఫై కాలు పెట్టి మోకాలి ఫై అరచేతులు ఉంచి వెనక్కు,ముందుకు వంగాలి.
3 ) చెక్క ముల్లుల కర్రతో  అరచేతులను,అరికాళ్ళను రుద్దాలి.
అరికాళ్ళ మంటల నివారణకు ఆహార కానుక :
1 ) ఆముదం పప్పును తగినన్ని పాలతో paste చేసి రాత్రి అరికాలికి మర్దన చేసి ఉదయం కడగాలి.
2 ) నానిన పెసర పప్పు పొట్టుతో సహా తీసుకుని హారతి కర్పూరం బిళ్ళలు వేసి paste చేసి రాత్రి అరికాలికి మర్దన చేసి ఉదయం కడగాలి.వీటిలో ఏదో ఒకటి రోజూ చేయడం వల్ల అరికాలి మంటలు తగ్గుతాయి.  
3 )  వేడి చేసే ఆహార పదార్ధాలు తినకూడదు.బార్లీ గంజి,మజ్జిగ ,కొబ్బరి నీళ్ళు తాగాలి.
4 ) ఉదయం  గ్లాస్ నీటిలో ధనియాలు నానబెట్టి సాయంత్రం వడబోసుకుని  తాగాలి.అలాగే సాయంత్రం గ్లాస్ నీటిలో ధనియాలు నానబెట్టి ఉదయం వడబోసుకుని  తాగాలి.
పాదాలలో వచ్చే ఆనెలకు సౌందర్య కానుక:
1 ) కలబంద గుజ్జులో 3 చిటికెల పసుపు వేసి రాత్రి పడుకునే ముందు  పాదం ఫై ఉన్న ఆనె ఫై ఈ paste పూసి కట్టు కట్టి ఉదయం కడగాలి.ఇలా 40 రోజులు చేస్తే ఆనెలు తగ్గుతాయి.
2 ) దాల్చిన చెక్కను వేయించి బూడిద చేసి సున్నం నీరు కలిపి రాత్రి పూట ఆనెలకు పూసి కట్టు కట్టి ఉదయం కడగాలి.

Wednesday, October 6, 2010

గుండె జబ్బు నివారణకు వ్యాయామం,ఆహరనియమాలు

గుండె జబ్బు నివారణకు వ్యాయామం :
1 ) అపానవాయు ముద్ర : చూపుడు వేలు మడిచి ఉంచి మద్య వేలు,ఉంగరం వేలును బొటన వేలుకి ఆనించి చిటికెన వేలు తెరిచి ఉంచాలి. రోజూ రెండు చేతులతో ఈ ముద్ర అరగంట వేయాలి.
2 ) ఆహరం తినటానికి ముందు చిటికిన వేలు కింద ఫైన సున్నితంగా 2 నిముషాలు press చేయాలి.
ఆహార కానుక:
1 )  ఎండిన ఉసిరికాయల పొడి,కలకండ పొడి సమానంగా తీసుకుని బాగా కలిపి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.ఈ పొడిని 3 పూటలా 1 స్పూన్ పొడి తినాలి.దీనివల్ల గుండె జబ్బులు రావు.శరీరం దృడంగా ఉంటుంది.
2 )  కొబ్బరి,కొబ్బరి నీళ్ళు,అంజూర పండ్లు,ఆక్రోట్,వెల్లుల్లి,ఉల్లిపాయలు తరచుగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

కాలేయం (liver ) సమస్యలకు వ్యాయామం,ఆహారనియమాలు

కాలేయం సమస్యకు చేయవలసిన  వ్యాయామం:
1 ) వజ్రాసనంలో కూర్చుని చంద్రభేధన  ప్రాణాయామం చేయాలి.
2 )  వజ్రాసనంలో కూర్చుని శీతలి ప్రాణాయామం చేయాలి.దీనివల్ల శరీరంలో వేడి తగ్గుతుంది.
3 ) శీత్కారి ప్రాణాయామం : ఫై దంతాలు కింది దంతాలు ఆనించి దంతాల మద్య నుండి గాలి పీల్చుకుని నోరు మూసి పీల్చిన గాలిని ముక్కుతో వదలాలి.
4 ) శలభాసనం : బోర్లా  పడుకుని గాలి పీల్చుతూ కాలు వెనక్కి లేపి,గాలి వదుల్తూ కిందకి దించాలి.ఇలా రెండో కాలుతో కూడా చేయాలి.ఇలా రోజూ 10 నుండి 12 సార్లు చేయాలి.

ఆహార కానుక: 50g ఎర్ర సెనగలు నానబెట్టి ఉడికించి వాటిమీద సైంధవలవనం పొడి చల్లి పరగడుపున తినాలి.
15నిమిషాల తర్వాత ఇంకో 50g  ఎర్రసెనగలు ఆవునెయ్యితో వేయించి  సైంధవలవనం పొడి చల్లి తినాలి.
ఒక గంట వరకు ఏమి  తినకూడదు.ఇలా వరుసగా 15 రోజులు తినాలి.
ఇవి తినే రోజుల్లో కారం,ఉప్పు,మాంసం,చేపలు,గుడ్లు,పులుపు తినకూడదు.
వేడివేడిగా ఉన్న ఆహారం తినడం వల్ల లివర్ (కాలేయ) సమస్యలు వస్తాయి. 

Friday, October 1, 2010

దోమల నివారణకు ఆయుర్వేద పొగ

ఆవాలు,ఉప్పు,వేపాకులు,ఉత్తరేణి ఆకులు,సీతాఫలం ఆకులు,పొగాకు అన్నింటిని ఎండబెట్టి పొడి చేసుకుని నిల్వచేసుకోవాలి.
ఆవు పిడకలు ముక్కలు చేసి వాటిమీద కర్పూరం పెట్టి వెగిలించి ఆ నిప్పుల పైన నిల్వచేసుకున్న పొడి చల్లి ఇల్లంతా పొగ వేయాలి.

నడుం నొప్పికి వ్యాయామం,ఆహార నియమాలు

నడుం నొప్పికి వ్యాయామం:
1 ) బోర్లా పడుకుని నౌకాసనం వేయాలి.
2 ) నిటారుగా నిలబడి ఎడమచేయి  ఫైకి ఎత్తి  కుడి కాలు వెనక్కి చాపాలి.అదే విధంగా కుడిచేయి ఫైకి ఎత్తి ఎడమకాలు వెనక్కి చాపాలి.
నడుం నొప్పికి ఆహారకానుక :
1 )  మినపపిండిలో 4 వెల్లులిరేకులు,3 గ్రా అల్లం,3 చిటికెల ఇంగువ,1 /4 స్పూన్ సైంధవలవణం వేసి రుబ్బి వడలాగా చేసి నూనెలో  వేయించాలి.ప్రతిరోజు ఒకటి లేదా రెండు వడలు తినడం వలన నడుం నొప్పి,మోకాల్లనొప్పులు,మెడ  నొప్పులు వాత నొప్పులు తగ్గుతాయి.
2 )  బాదం పప్పు - 1 /4 kg(రాత్రి నీటిలో నానవేసి ఉదయం పొట్టు తీసి నీడలో ఆరబెట్టి పొడి చేసుకోవాలి.)
      1 /4 kg గసాలు పొడి చేసుకోవాలి.
      1 /4 kg కలకండ పొడి చేసుకోవాలి.
ఫై పొడులని గాజు సీసాలో నిల్వచేసుకుని గ్లాసు పాలలో ఒక స్పూన్ పొడి కలిపి ప్రతి రోజూ ఉదయం,సాయంత్రం తాగాలి.
ఇలా 40 రోజులు తాగడం వలన నడుం గట్టిపడుతుంది.

ఆయుర్వేద పేస్ ప్యాక్

1 ) అతిమధురం (యష్టిమధుకం ) - 100 గ్రా .
2 ) బార్లీ గింజలు  - 100 గ్రా .
3 ) తెల్ల ఆవాలు  - 100 గ్రా .(పెనంలో వేసి దోరగా వేయించాలి. ).
4 ) లోధుగ చెట్టు బెరడు  - 100 గ్రా .
ఫై వాటిని మెత్తని పొడి చేసుకుని నిల్వచేసుకోవాలి. తగినంత పొడిలో నీరు లేదా పాలు కలిపి పేస్టులాగా చేసి ముఖానికి రాసి గంట తర్వాత కడగాలి.ఇలా రోజుకు ఒకసారి చేయాలి.వరుసగా 40 రోజులు వాడడం వలన ముఖం ఫై ఉన్న మొటిమలు,మచ్చలు పోయి ముఖం బంగారు రంగులో మెరిసిపోతుంది.

కేశాలకు కలబంద తైలం

కలబంద చెక్కు తీసి నీరు కలపకుండా రసం తీయాలి.సమానంగా కొబ్బరినూనె కలిపి సన్న మంట ఫై మరిగించాలి.నీరు ఆవిరి అయ్యి నూనె మిగలాలి.స్టవ్ ఆర్పే ముందు ధవణం ఆకులు వేయాలి. నూనె చల్లారాక వడకట్టి  నిల్వచేసుకోవాలి . తగినంత నూనె గోరువెచ్చగా చేసి  రోజూ వెంట్రుకలకు మర్దన చేసుకోవడం వలన జుట్టు రాలే సమస్య ఉండదు.చుండ్రు పోయి వేడి తగ్గుతుంది.

పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగటానికి ఉత్తరేణి తైలం

ఉత్తరేణి ఆకులు కడిగి నీరు కలపకుండా రసం తీయాలి.ఉత్తరేణి ఆకుల రసంకు సమానంగా నువ్వులనునే వేసి సన్న మంట ఫై మరిగించాలి. నీరు ఆవిరైపోయిన తర్వాత నూనే మిగులుతుంది.ఈ నూనే ను గాజు సీసాలో నిల్వచేసుకోవాలి.
స్నానానికి పోయేముందు తగినంత నూనే తీసుకుని గోరువెచ్చగా చేసి పొట్ట చుట్టూ మర్దన చేసి గంట తర్వాత స్నానం చేయాలి.
దీనివల్ల  పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది.అలాగే పావడా నాడా కట్టడం వల్ల వచ్చిన అలర్జీ,నల్ల మచ్చలు తగ్గుతాయి.

పొట్ట తగ్గటానికి తీసుకోవలసిన ఆహారం

ఒక కప్పు పాత బియ్యంలో 4 కప్పుల నీరు పోసి జీలకర్ర మిరియాల పొడి,ధనియాల పొడి,వాము,క్యారెట్,బీట్రూట్  (ఇంకేవైన కూరగాయలు) వేసి కొత్తిమిర,కర్వేపాకు,పుదినా వేసి బాగా ఉడికించి జావ లాగా  చేసుకుని ఉదయం టిఫిన్ బదులు ఈ జావ తాగడం వలన ఉదరంలోని కొవ్వు కరిగిపోతుంది.

amazon-oneplus

Labels