నడుం నొప్పికి వ్యాయామం:
1 ) బోర్లా పడుకుని నౌకాసనం వేయాలి.
2 ) నిటారుగా నిలబడి ఎడమచేయి ఫైకి ఎత్తి కుడి కాలు వెనక్కి చాపాలి.అదే విధంగా కుడిచేయి ఫైకి ఎత్తి ఎడమకాలు వెనక్కి చాపాలి.
నడుం నొప్పికి ఆహారకానుక :
1 ) మినపపిండిలో 4 వెల్లులిరేకులు,3 గ్రా అల్లం,3 చిటికెల ఇంగువ,1 /4 స్పూన్ సైంధవలవణం వేసి రుబ్బి వడలాగా చేసి నూనెలో వేయించాలి.ప్రతిరోజు ఒకటి లేదా రెండు వడలు తినడం వలన నడుం నొప్పి,మోకాల్లనొప్పులు,మెడ నొప్పులు వాత నొప్పులు తగ్గుతాయి.
2 ) బాదం పప్పు - 1 /4 kg(రాత్రి నీటిలో నానవేసి ఉదయం పొట్టు తీసి నీడలో ఆరబెట్టి పొడి చేసుకోవాలి.)
1 /4 kg గసాలు పొడి చేసుకోవాలి.
1 /4 kg కలకండ పొడి చేసుకోవాలి.
ఫై పొడులని గాజు సీసాలో నిల్వచేసుకుని గ్లాసు పాలలో ఒక స్పూన్ పొడి కలిపి ప్రతి రోజూ ఉదయం,సాయంత్రం తాగాలి.
ఇలా 40 రోజులు తాగడం వలన నడుం గట్టిపడుతుంది.