పొట్ట తగ్గడానికి వ్యాయామం :
1) ఉత్తమ ప్రాణాయామం :
వజ్రాసనం లో కుర్చుని నడుముఫై నాలుగు వేళ్ళు ముందుకు బొటన వేలు వెనకాలకు పెట్టి పట్టు కోవాలి , తరువాత నాలుగు సార్లు ఓంకారం చెప్పే సమయం లో గాలి పీల్చి , నాలుగు ఓంకారాలు చెప్పే సమయంలో గాలిని బంధించి ఆరు ఓంకారాలు చెప్పే సమయం లో గాలి వదలాలి.
2) మధ్యమ ప్రాణాయామం:
వజ్రాసనం లో కుర్చుని చంక కింద చేతులు వుంచి నాలుగు ఓంకారాలు చెప్పే సమయం లో గాలి పీల్చి , నాలుగు ఓంకారాలు చెప్పే సమయంలో గాలిని బంధించి నాలుగు ఓంకారాలు చెప్పే సమయం లో గాలి వదలాలి.
3) చేతులు తలపై నుంచి ఎత్తి వెనకాలకి వంచి వీపుపై పెట్టి నాలుగు ఓంకారాలు చెప్పే సమయంలో గాలి పీల్చి , నాలుగు ఓంకారాలు చెప్పే సమయంలో గాలిని బంధించి రెండు ఓంకారాలు చెప్పే సమయం లో గాలి వదలాలి.
పొట్ట తగ్గడానికి ఆహారకానుక :
నెలకు ఒకసారి విరేచనాల మందు వేసుకుని పొట్టను శుద్ధి చేసుకోవాలి.ఉదయం నిద్రపోకూడదు.రాత్రి కూడా 4 లేదా 5 గంటలు మాత్రమే నిద్రపోయి మిగిలిన సమయం పుస్తకాలు చదువుతూ ,వ్యాయామం చేస్తూ ఉండాలి. ఎవలు,కొర్రలు తినాలి.కారం,చేదు ,వగరు ఎక్కువ తినాలి.చెరకు పదార్థాలు తినకూడదు.
సుఖ విరేచనానికి మందు :
రెండు చెంచాల అల్లంరసం ,రెండు చెంచాల తేనె ,నాలగు చెంచాల ఆముదం అన్నీ కలిపి మూడు పొంగులు రానిచ్చి గోరువెచ్చగా చేసి తెల్లవారు జామున పరగడుపున తాగాలి.ఇది తాగిన రోజు చారు అన్నం తిని ఎక్కువగా తిరక్కుండా విశ్రాంతి తీసుకోవాలి.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి యోగా ప్రక్రియలోనిది ఇది
ReplyDeleteThis comment has been removed by the author.
Delete