amazon-3

Friday, October 1, 2010

దోమల నివారణకు ఆయుర్వేద పొగ

ఆవాలు,ఉప్పు,వేపాకులు,ఉత్తరేణి ఆకులు,సీతాఫలం ఆకులు,పొగాకు అన్నింటిని ఎండబెట్టి పొడి చేసుకుని నిల్వచేసుకోవాలి.
ఆవు పిడకలు ముక్కలు చేసి వాటిమీద కర్పూరం పెట్టి వెగిలించి ఆ నిప్పుల పైన నిల్వచేసుకున్న పొడి చల్లి ఇల్లంతా పొగ వేయాలి.

నడుం నొప్పికి వ్యాయామం,ఆహార నియమాలు

నడుం నొప్పికి వ్యాయామం:
1 ) బోర్లా పడుకుని నౌకాసనం వేయాలి.
2 ) నిటారుగా నిలబడి ఎడమచేయి  ఫైకి ఎత్తి  కుడి కాలు వెనక్కి చాపాలి.అదే విధంగా కుడిచేయి ఫైకి ఎత్తి ఎడమకాలు వెనక్కి చాపాలి.
నడుం నొప్పికి ఆహారకానుక :
1 )  మినపపిండిలో 4 వెల్లులిరేకులు,3 గ్రా అల్లం,3 చిటికెల ఇంగువ,1 /4 స్పూన్ సైంధవలవణం వేసి రుబ్బి వడలాగా చేసి నూనెలో  వేయించాలి.ప్రతిరోజు ఒకటి లేదా రెండు వడలు తినడం వలన నడుం నొప్పి,మోకాల్లనొప్పులు,మెడ  నొప్పులు వాత నొప్పులు తగ్గుతాయి.
2 )  బాదం పప్పు - 1 /4 kg(రాత్రి నీటిలో నానవేసి ఉదయం పొట్టు తీసి నీడలో ఆరబెట్టి పొడి చేసుకోవాలి.)
      1 /4 kg గసాలు పొడి చేసుకోవాలి.
      1 /4 kg కలకండ పొడి చేసుకోవాలి.
ఫై పొడులని గాజు సీసాలో నిల్వచేసుకుని గ్లాసు పాలలో ఒక స్పూన్ పొడి కలిపి ప్రతి రోజూ ఉదయం,సాయంత్రం తాగాలి.
ఇలా 40 రోజులు తాగడం వలన నడుం గట్టిపడుతుంది.

ఆయుర్వేద పేస్ ప్యాక్

1 ) అతిమధురం (యష్టిమధుకం ) - 100 గ్రా .
2 ) బార్లీ గింజలు  - 100 గ్రా .
3 ) తెల్ల ఆవాలు  - 100 గ్రా .(పెనంలో వేసి దోరగా వేయించాలి. ).
4 ) లోధుగ చెట్టు బెరడు  - 100 గ్రా .
ఫై వాటిని మెత్తని పొడి చేసుకుని నిల్వచేసుకోవాలి. తగినంత పొడిలో నీరు లేదా పాలు కలిపి పేస్టులాగా చేసి ముఖానికి రాసి గంట తర్వాత కడగాలి.ఇలా రోజుకు ఒకసారి చేయాలి.వరుసగా 40 రోజులు వాడడం వలన ముఖం ఫై ఉన్న మొటిమలు,మచ్చలు పోయి ముఖం బంగారు రంగులో మెరిసిపోతుంది.

కేశాలకు కలబంద తైలం

కలబంద చెక్కు తీసి నీరు కలపకుండా రసం తీయాలి.సమానంగా కొబ్బరినూనె కలిపి సన్న మంట ఫై మరిగించాలి.నీరు ఆవిరి అయ్యి నూనె మిగలాలి.స్టవ్ ఆర్పే ముందు ధవణం ఆకులు వేయాలి. నూనె చల్లారాక వడకట్టి  నిల్వచేసుకోవాలి . తగినంత నూనె గోరువెచ్చగా చేసి  రోజూ వెంట్రుకలకు మర్దన చేసుకోవడం వలన జుట్టు రాలే సమస్య ఉండదు.చుండ్రు పోయి వేడి తగ్గుతుంది.

పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగటానికి ఉత్తరేణి తైలం

ఉత్తరేణి ఆకులు కడిగి నీరు కలపకుండా రసం తీయాలి.ఉత్తరేణి ఆకుల రసంకు సమానంగా నువ్వులనునే వేసి సన్న మంట ఫై మరిగించాలి. నీరు ఆవిరైపోయిన తర్వాత నూనే మిగులుతుంది.ఈ నూనే ను గాజు సీసాలో నిల్వచేసుకోవాలి.
స్నానానికి పోయేముందు తగినంత నూనే తీసుకుని గోరువెచ్చగా చేసి పొట్ట చుట్టూ మర్దన చేసి గంట తర్వాత స్నానం చేయాలి.
దీనివల్ల  పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది.అలాగే పావడా నాడా కట్టడం వల్ల వచ్చిన అలర్జీ,నల్ల మచ్చలు తగ్గుతాయి.

పొట్ట తగ్గటానికి తీసుకోవలసిన ఆహారం

ఒక కప్పు పాత బియ్యంలో 4 కప్పుల నీరు పోసి జీలకర్ర మిరియాల పొడి,ధనియాల పొడి,వాము,క్యారెట్,బీట్రూట్  (ఇంకేవైన కూరగాయలు) వేసి కొత్తిమిర,కర్వేపాకు,పుదినా వేసి బాగా ఉడికించి జావ లాగా  చేసుకుని ఉదయం టిఫిన్ బదులు ఈ జావ తాగడం వలన ఉదరంలోని కొవ్వు కరిగిపోతుంది.

Thursday, September 23, 2010

వయసు పెరిగినా మేను మెరవడం కోసం తీసుకోవలసిన ఆహారం

1 )  మనం తీసుకునే ఆహారంలో గింజలు,ఆకుకూరలు,ఆలివ్ నూనె ,  ఒమెగా-త్రీ ,ఫ్యాటీ  ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారం,పండ్లు,కూరగాయలు తప్పనిసరిగా ఉండాలి .
2 )  వీటితో  పాటు విటమిన్-A ,B ,C  లు,ఫోలిక్ ఆమ్లం శరీరానికి సమంగా అందేట్టు చూడాలి .
3 ) సేంద్రియ సాగు ద్వారా ఉత్పత్తి  అయిన కూరగాయలు అయితే అధిక మొత్తంలో విటమిన్లను,ఖనిజలవనాలను  శరీరానికి అందిస్తాయి.వీటివల్ల చర్మ కణాలు ఆరోగ్యంగా ఉండి చర్మ సౌందర్యాన్ని ద్విగునికృతం చేస్తాయి .
చిన్నవయసులో ముదుసలి లక్షణాలు కనిపిస్తుంటే తీసుకోవలసిన ఆహారం:
1 ) వారంలో కనీసం 2 సార్లు చేపలు ఆహారంలో ఉండేట్టు చూసుకోవాలి.వీటిలోని ఒమేగా-త్రీ ఫ్యాటీ ఆమ్లాలు చర్మ కణాలను కాంతివంతం చేస్తాయి .
2 ) విభిన్న రంగుల్లో,ముదురు రంగుల్లో  ఉన్న పండ్లు,కూరగాయలు రోజుకు 5 సార్లు తినాలి.వీటిలోని యాంటీ  ఆక్సిడెంట్లు చర్మానికి నిగారింపు,సోయగం అందించి ఫ్రీరాడికల్స్ ని నివారిస్తాయి .
3 ) రోజుకు 3 సార్లు పొట్టు తీయని ధాన్యాలు,చిక్కుడు  జాతి గింజలు తినాలి.వీటివల్ల పేచు అంది రక్తంలో కొవ్వు తగ్గుతుంది .
4 ) ప్రొబయాటిక్ గుణాలు అధికంగా ఉండే పెరుగు కనీసం రోజులో 3 సార్లు తినాలి.
5 ) రోజులో కొద్దిమొత్తంలో గింజలు తినాలి.వీటిలోని కెలోరీలు ,B విటమిన్లు గుండెను ,మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి .
6 ) బార్లీ,వెల్లుల్లి,ఉల్లి,బీన్స్,మొలకలు ఆహారంలో తీసుకోవాలి.
7 ) రోజుకు 10 గ్లాసుల నీళ్లు తాగాలి.
8 ) రోజుకు 6 చిన్నకప్పుల గ్రీన్ టీ తాగటం వల్ల ఫ్రీరాడికల్స్ ని నిరోధించి,చర్మం ఫై  అతినీలలోహిత కిరణాల ప్రభావం పడకుండా చేస్తుంది .
9 ) శాచురేటెడ్ కొవ్వులు 10 శాతం ఆహారంలో ఉండేలా చూసుకొంటే వయసు లక్షణాలను అధిగమించవచ్చు.మాంసాహారం నుంచి అందే కొవ్వులు తగ్ఘించాలి.
10 ) వీటితో పాటు శారీరక వ్యాయామం,విశ్రాంతి అవసరం.

Beauty Tips

 ఎండకు కమిలిన ముఖానికి :
1) 4 స్పూన్ల కీరదోస గుజ్జు, 1 స్పూన్ తేనె కలిపి ముఖానికి మర్దన చేసి పావుగంట తర్వాత చల్లటి నీటితో కడగాలి.

2) కప్పు పెరుగులో చెంచాడు మెంతులు నానబెట్టి వాటిని మెత్తగా నూరి తలకి పట్టించి స్నానం చేస్తే చుండ్రు తగ్గిపోతుంది.

3) 4 స్పూన్ల బొప్పాయి గుజ్జు,1 స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి మర్దన చేసి పావుగంట తర్వాత కడిగేస్తే మర్నాటికి ముఖం తాజాగా తయారవుతుంది.

4) వేపాకుల ముద్దలో చెంచా పెసరపిండి కలిపి పాదాల పగుళ్ళున్న చోట పట్టించి గంట తర్వాత కడిగేస్తే పగుళ్ళు దూరమవుతాయి .

చిట్కాలు

1 ) కాలిన గాయాలకు బాగా పండిన అరటిపండు గుజ్జును రాస్తే త్వరగా మానిపోతాయి.
2 ) పులుసు కూరల్లో చింతపండు రసానికి బదులు టమోటోగుజ్జు వేస్తే కూరలు మరింత రుచిగా ఉంటాయి.
3 ) సుగంధ ద్రవ్యాలను పొయ్యి,విద్యుత్ ఉపకరణాలకు దూరంగా భద్రపరచాలి లేదంటే అవి త్వరగా సువాసనలను కోల్పోతాయి ...
4 ) వెనిగర్,నీళ్ళు సమపాళ్ళలో కలిపి ఫ్రిజ్ లోపలి భాగం తుడుస్తే దుర్వాసన రాదు .
5 ) రంద్రమునుండి చీమలు వస్తుంటే ఆ రంధ్రం దగ్గర కాస్త పెట్రోలియం జెల్లీ రాస్తే చీమలు రావు .
6 ) వాడేసిన నిమ్మచెక్కలతో లంచ్ బాక్సులను  రుద్దితే వాసన రాకుండా ఉంటాయి
7 ) పచ్చిబటాణిలను ఉడికించేటపుడు చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటాయి .
8 ) బియం,తృణధాన్యాలను నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు పసుపు కొమ్ములు లేదా వెల్లుల్లి రేకలు వేస్తే పురుగు పట్టకుండా  ఉంటాయి. 
9 ) పిండిని నిల్వ ఉంచిన డబ్బాలో కర్వేపాకు వేసి ముతపెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది .
10 ) ధర్మోప్లాస్క్ లో  టీ ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే లోపలి భాగం రంగు మారుతుంది.అలాంటప్పుడు దాన్ని వెనిగర్ తో  శుభ్రపరిస్తే   మామూలు  రంగుకు వస్తుంది.

ముఖం ఫై ముడతలు పోవాలంటే

ముఖం ఫై  ముడతలు పోవాలంటే:

1 ) తరచూ గుడ్డులోని తెల్లసొనను ముఖానికి పట్టించి ఆరాక కడగాలి.
2 ) ఆముదము ముఖానికి మర్దన చేసి పావుగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి.
3 ) 2 స్పూన్ల పెరుగు,1 /2 స్పూన్ తేనె,4 చుక్కలు నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి.
4 ) చెరకురసం లేదా పంచదార నీళ్ళల్లో కాస్త పసుపు కలిపి ముఖానికి రాసి ఆరాక కడగాలి.
ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే ముడుతలు క్రమంగా తగ్గుతాయి.
5 ) గుడ్డులోని తెల్లసొనకు 2 చెంచాల తేనె కలిపి ముఖానికి,మెడకు రాసి గంట తర్వాత గోరువెచ్చటి  నీటితో కడగాలి.