amazon-3

Monday, August 23, 2010

TIPS

1) డైనింగ్ టేబుల్ తుడిచే బట్టలు చాకలిసోడా కలిపిన వేడి నీటిలో గంటసేపు నానబెట్టి ఉతకడం వల్ల మురికి తొలగిపోతుంది .
2) చేతులకు కొంచెం నూనె రాసుకొని అరటిదూటను మజ్జిగలో తరిగితే జిగురు అంటకుండా ఉంటుంది.
3) అనాస పండు నిల్వ ఉండాలంటే ఆకులు తీయకుండా ఉండాలి.
4)  మెంతులు తరచు ఆహారంలో తీసుకోవడం వల్ల :
  1) బాలింతలకు పాలు వృద్ధి చెందుతాయి.
  2) మధుమేహం అదుపులో ఉంటుంది.
  3) నెలసరి సమస్యలు అదుపులో ఉంటాయి.
  4) హార్మోన్ల అసమతుల్యత వేదించదు.
5) ఇడ్లీలకు మినప్పప్పు రుబ్బుతున్నప్పుడు అరచెంచా మెంతులు వేసి రుబ్బితే ఇడ్లీలు మృదువుగా వస్తాయి.
6) తేనెను చెంచాతో కొలవాల్సి వస్తే,దాన్ని ఓ సారి నూనెలో ముంచి తీస్తే సరి.పని సులభం అవుతుంది.
7) కూరగాయలను తురిమే గ్రేటర్ ను ఉపయోగించిన తర్వాత వ్యర్ధాలను తొలగించాలంటే టూత్ బ్రష్ ఉపయోగిస్తే సరి .
8)

TIPS FOR BEAUTIFUL SKIN

1) చూయింగ్ గమ్ అదే పనిగా నమలడం వల్ల ముఖం మీద చర్మం ముడుతలు పడుతుంది.
2) పచ్చిపాలలో నిమ్మరసం కలిపి ముఖానికి రాసి పావుగంట ఆగి గోరువెచ్చని నీటితో కడగడం వల్ల  చర్మం తెల్లబడుతుంది. దీనివల్ల ఎండ వల్ల నల్లబడ్డ చర్మం తిరిగి మామూలు స్థితికి వస్తుంది.దీనిని  చేతులు,మెడ,వీపుకు కూడా పూయవచ్చు.
3) గుడ్డులోని తెల్ల సోన ముఖానికి రాసి ఆరినాక గోరువెచ్చని నీటితో కడగడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది.
4) ఎండలో నుండి వచ్చాక ముఖాన్ని చల్లటి నీటితో కడిగి కలబంద గుజ్జు లేదా  ఏదైనా కలబంద క్రీం ముఖానికి రాసి మర్దనా చేయడం వల్ల ఎండ వేడి నుంచి చర్మాన్ని కాపాడి ఫ్రెష్ గా ఉంచుతుంది.
5) వెనిగర్ లో ముంచిన బట్టతో ముఖం,మెడ,చేతులు తుడవడం వల్ల దుమ్ము,ధూళి తొలగి చర్మం మృదువుగా మారుతుంది .
6) బంగాళాదుంప చెక్కు తీసి మెత్తగా రుబ్బి ఆ గుజ్జు ముఖానికి రాసి ఆరాక కడగడం వల్ల చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.

TIPS WITH RAW MANGO

1) ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు పచ్చి మామిడికాయను ఉడికించి రసం తీసి పంచదార కలిపి తింటే అధిక దాహం,అధిక స్వేదం అదుపులో ఉంటుంది.
2) ఉడికించిన మామిడికాయ రసం,గోరువెచ్చని నీటిలో కలిపి కళ్ళు శుభ్రపరచుకుంటే కళ్ళఎరుపు,అలసట తగ్గుతాయి.
3) పచ్చిమామిడిముక్కలకు ఉప్పు,తేనె కలిపి తింటే వాంతులు,విరేచనాలు,అజీర్ణం,మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి.
4) మామిడికాయ ఎండబెట్టి పొడి చేసి ఆహారంతో తింటే నోటిపూత,విటమిన్ "సి" లోపం,అల్సర్ వంటి సమస్యలు తగ్గుతాయి.
5) మామిడికాయ జీడిని పచ్చిగా వాడకూడదు.ఎండించి పొడిచేసి వాడాలి.
6) మామిడికాయ జీడి పొడిని మజ్జిగలో అరచెంచా కలిపి తింటే విరేచనాలు,మొలలు తగ్గుతాయి.ఈ పొడి వల్ల కడుపులో పురుగులు నశిస్తాయి.
7) లేత మామిడి ఆకులు నమిలితే నోటి దుర్వాసన,చిగుళ్ళవాపు తగ్గుతాయి.
8) మామిడి చెట్టు బెరడు కాల్చి ఆ మసిని పులిపిర్ల ఫై రాస్తే అవి తగ్గుతాయి.
9) మామిడి చెట్టు ఫై ఉండే జిగురును  కొబ్బరి నూనెలో కలిపి చర్మం ఫై వచ్చే దురదలు,కాలి పగుళ్ళకు రాస్తే అవి పోతాయి.
10) బియ్యం కడిగిన నీటిలో చెంచా జీడి పొడి కలిపి తాగితే అధిక ఋతుస్రావం తగ్గుతుంది.
11) గోరువెచ్చని నీటిలో పంచదార,అర చెంచా జీడి పొడి కలిపి భోజనానికి ముందు తాగితే కడుపులో మంట తగ్గుతుంది.
12) మెంతిపొడి,జీడి పొడి చెంచా చొప్పున తీసుకుని కుంకుడు రసంలో కలిపి తలస్నానం చేస్తే వెంట్రుకలు మృదువుగా మారుతాయి.చుండ్రు సమస్య తగ్గుతుంది.

Saturday, August 21, 2010

పొట్ట తగ్గడానికి వ్యాయామం

పొట్ట తగ్గడానికి వ్యాయామం  :


1) ఉత్తమ ప్రాణాయామం :


వజ్రాసనం లో కుర్చుని నడుముఫై నాలుగు వేళ్ళు ముందుకు బొటన వేలు వెనకాలకు పెట్టి పట్టు కోవాలి , తరువాత నాలుగు సార్లు ఓంకారం చెప్పే సమయం లో గాలి పీల్చి , నాలుగు ఓంకారాలు చెప్పే సమయంలో గాలిని బంధించి ఆరు ఓంకారాలు చెప్పే సమయం లో గాలి వదలాలి.

2) మధ్యమ  ప్రాణాయామం:


వజ్రాసనం లో కుర్చుని చంక కింద చేతులు వుంచి నాలుగు ఓంకారాలు చెప్పే సమయం లో గాలి పీల్చి , నాలుగు ఓంకారాలు చెప్పే సమయంలో గాలిని బంధించి నాలుగు ఓంకారాలు చెప్పే సమయం లో గాలి వదలాలి.
 3) చేతులు తలపై  నుంచి ఎత్తి వెనకాలకి వంచి వీపుపై పెట్టి నాలుగు ఓంకారాలు చెప్పే సమయంలో గాలి పీల్చి , నాలుగు ఓంకారాలు చెప్పే సమయంలో గాలిని బంధించి రెండు  ఓంకారాలు చెప్పే సమయం లో గాలి వదలాలి.
పొట్ట తగ్గడానికి ఆహారకానుక :


నెలకు ఒకసారి విరేచనాల మందు వేసుకుని పొట్టను శుద్ధి చేసుకోవాలి.ఉదయం నిద్రపోకూడదు.రాత్రి కూడా 4 లేదా 5 గంటలు మాత్రమే నిద్రపోయి మిగిలిన సమయం పుస్తకాలు చదువుతూ ,వ్యాయామం చేస్తూ ఉండాలి. ఎవలు,కొర్రలు తినాలి.కారం,చేదు ,వగరు ఎక్కువ తినాలి.చెరకు పదార్థాలు తినకూడదు.
సుఖ విరేచనానికి మందు :


రెండు చెంచాల అల్లంరసం ,రెండు చెంచాల తేనె ,నాలగు  చెంచాల ఆముదం అన్నీ కలిపి మూడు పొంగులు రానిచ్చి గోరువెచ్చగా చేసి తెల్లవారు జామున పరగడుపున తాగాలి.ఇది తాగిన రోజు చారు అన్నం తిని ఎక్కువగా తిరక్కుండా విశ్రాంతి తీసుకోవాలి.