amazon-3

Wednesday, November 28, 2012

కడుపులో పురుగులు (నులిపురుగులు )

 కడుపులో పురుగులు (నులిపురుగులు ) నివారణకు వ్యాయామం :


       తిన్న ఆహారం జీర్ణం కాక పొట్టలో మురిగి అక్కడ పురుగులు పుడతాయి. అలాంటి వారి  ముఖం పాలిపోతుంది. కొందరు పళ్ళు కొరుకుతారు.రంగులతో చేసిన ఆహారం తినరాదు. బయట చేసిన ఆహారం తినరాదు. ఇంట్లో చేసిన ఆహారం మాత్రమే  తినాలి. తిని కూర్చుని ఉండకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయని వారు గంజి  మాత్రమే తాగాలి.అలాకాకుండా వేరే ఆహారం తీసుకుంటే  పురుగులు పుట్టి ప్రేగులను నాశనం చేస్తాయి.రోజూ తప్పకుండ ఒక గంట వ్యాయామం చేయాలి.  వ్యాయామం చేయకుంటే తిన్న ఆహారం జీర్ణం కాక పొట్టలో మురిగి అక్కడ పురుగులు పుడతాయి. 
1)  కపాలభాటి వ్యాయామం :

వజ్రాసనంలో కూర్చుని కడుపుని లోపలికి చకచకా కొట్టాలి.
2) ఉదరచాలనం .

3) మయూరాసనం :
నేలపై రెండు అరచేతులను ఆనిచ్చి చేతులపై శరీరాన్ని నిలపాలి.నులిపురుగుల నివారణకు  ఏల్చూరి ఆహార కానుక :
50g దానిమ్మ చెట్టు బెరడు నలగొట్టి 1లీటర్  నీళ్ళు పోసి  మరిగించాలి.1/4 లీటర్ కషాయం అయ్యాక ఉదయం పరగడుపున ఒక కప్పు కషాయం తాగాలి. అలా ఆరోజంతా గంటగంటకు 20g  తాగుతూ ఉంటే మలంలో ఈ పురుగులు పోతాయి. ఆరోజు గంజి మాత్రమే తాగాలి. వేరే  ఆహారం తినకూడదు . ఆవు లేదా గేదె పేడ  మురిగి దాని నుండి ఎలా  పురుగులు పుడతాయో అలాగే మనం  తిన్న ఆహారం అరగక అది  మురిగి పురుగులు పుడతాయి.అంతే కాని వేరొక చోట నుండి కడుపులోకి  పురుగులు రావు .

No comments:
Write comments