మంగు మచ్చల నివారణకు వ్యాయామం:
------------------------------------------
నీటితో లేదా నీటిలో పసుపు వేసుకుని ముఖానికి ఆవిరి పట్టాలి.తరువాత ఆల్మండ్ ఆయిల్ పూసి 5 నిమిషాలు మసాజ్ చేసి బుగ్గలను పూరించి వదలాలి .మూతిని ఇరుపక్కలకు లాగినట్లు చేయాలి. కళ్ళు గట్టిగా మూసి తెరవాలి.
ఉష్ట్రాసనం :
------------
వజ్రాసనంలో కూర్చుని మడమలను చేతులతో పట్టుకుని నడుంని, తలను పైకి ఎత్తాలి.
సర్వాంగాసనం:
---------------
కాళ్ళు పైకి ఎత్తి నడుంను చేత్తో పట్టుకోవాలి.
ఆహార కానుక :
-----------------
మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి.కోపం, ఆవేశం లాంటి వాటి వల్ల కఫ, వాత ,పిత్తాలు చర్మంలోకి చేరి ముఖంపై మంగు మచ్చలను ఏర్పరుస్తుంది . అందుకే మనస్సు కల్మషం లేకుండా నిర్మలంగా ఉండాలి .
చిరిసెనగలు , మర్రిచెట్టు లేత చిగుర్లు రోట్లో వేసి నీళ్ళు లేదా పాలతో మెత్తగా నూరి మంగు మచ్చలపై దట్టంగా పూసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే మంగు మచ్చలు పోతాయి.

No comments:
Write comments