1 ) కొత్తిమేరలో యాంటి ఆక్సిడెంట్లు సమృద్దిగా లభిస్తాయి.
2 ) కొత్తిమిరలో ఉండే పోషకాలు జీర్ణ వ్యవస్థకు,రోగ నిరోధక శక్తికి ఎంతో సాయపడతాయి.
3 ) కొత్తిమిరలో ఉండే డొడిసెనోల్ అనే పదార్ధం పేగుల్లో ఏర్పడే సాల్మొనెల్లా బ్యాక్టిరియా ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది.
4 ) గ్లాసుడు మజ్జిగలో చెంచా కొత్తిమిర రసం,చిటికెడు జీలకర్ర కలిపి తాగటం వల్ల శరిరానికి విటమిన్ 'A ', 'B 1 ' ,'B 2 ','C ',ఇనుము సమృద్ధిగా అంది శరీర నిర్మాణానికి,ఎముకల దృడత్వానికి,చర్మ సంరక్షణకు తోడ్పడతాయి.
5 ) అజీర్ణంతో బాధపడేవారు కొత్తిమిర రసంలో జీలకర్ర,నిమ్మరసం,ఉప్పు కలిపి తాగాలి.
6 ) గర్భిణులు రోజూ రెండు చెంచాల కొత్తిమిర రసంలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల కడుపులో తిప్పడం,మలబద్ధకం వంటి సమస్యలు పోతాయి.
7 ) పేగు పూత ,కడుపులో మంట ఉన్నవారు కొత్తిమిరను పెరుగుతో కలిపి తినాలి.
8 ) నోటి దుర్వాసన,చిగుళ్ల సమస్యలు ఉన్నవారు కొత్తిమిర ఆకులు నమిలి మింగాలి.
9 ) కామెర్లు వచ్చినపుడు కొత్తిమిరను కూరల్లో వేసుకుని తినడం వల్ల త్వరగా కోలుకుంటారు.
10 ) కొత్తిమిర తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
11 ) ధనియాలను చారులాగా కాచి తాగడం వల్ల విరేచనాలు,జ్వరము తగ్గుతాయి.
12 ) నెలసరి సమయంలో అధికంగా ఋతుస్రావం అవుతుంటే ధనియాల కషాయాన్ని రోజుకి రెండు సార్లు పుచుకుంటే సమస్య నియంత్రణలో ఉంటుంది .