amazon-3

Friday, November 26, 2010

నోటి దుర్వాసన నివారణకు ఆయుర్వేద ఔషధం :
ఆకుపత్రి,జాపత్రి,లవంగాలు,ఉసిరికాయలు,ఇలాచి అన్నింటిని సమానంగా తీసుకుని తగినంత  నీరు పోసి పేస్టు చేసి సెనగ గింజంత మాత్రలు చేసి నీడలో ఆరబెట్టి నిల్వచేసుకోవాలి.పూటకు ఒకటి చప్పరించడం వల్ల నోటి దుర్వాసన పోతుంది.  
శీతపిత్త (దురద,దద్దుర్లు )నివారణకు వ్యాయామం,ఆహార నియమాలు,ఆయుర్వేద ఔషదాలు :
వ్యాయామం :
1 ) ఒక బట్టను చల్లని నీటిలో తడిపి బాగా పిండి గొంతు కింద నుండి నాభి కింద వరకు టవల్ లాగా చుట్టి ఫైన టర్కీ టవల్ చుట్టాలి.శరీరం మొత్తం దద్దుర్లు వచ్చేవారు శరీరం మొత్తం తడి బట్ట చుట్టుకోవాలి.ఇలా 15 నుండి 20 నిముషాలు బట్ట చుట్టుకుని ఉండాలి.
2 ) భస్త్రికా ప్రాణాయామం రోజూ 10 సార్లు చేయాలి.
3 ) చంద్ర భేధన ప్రాణాయామం రోజూ 10 సార్లు చేయాలి.
4 ) సూర్య భేధన ప్రాణాయామం రౌ 10 సార్లు చేయాలి.
ఆహార నియమాలు:
మన శరీరంలో కఫం ఎక్కువై వేడి రూపంలో కఫం చర్మం ఫైకి వచ్చి దద్దుర్లుగా మారతాయి.
చింతపండు వాడకూడదు.ఫ్రిజ్ లోని ఆహార పదార్దాలు తినకూడదు.
చలి గాలిలో తిరగకూడదు
ఆయుర్వేద ఔషదాలు  :
1 ) ఆవాల నూనె వేడి చేసి గోరువెచ్చగా దద్దుర్లు ఉన్న చోట పూసి గంట తర్వాత వేడి నీటితో స్నానం చేయాలి.
2 ) సైంధవలవణం,నెయ్యి కలిపి పేస్టు చేసి శరీరం మొత్తం పూసి గంట తర్వాత స్నానం చేస్తే దురద,దద్దుర్లు పోతాయి.
3 ) 30 గ్రాముల అల్లం రసంలో 10 గ్రాముల పథ బెల్లం కలిపి ఉదయం,సాయంత్రం ఆహారానికి గంట ముందు తినాలి.
4 ) వాము వేయించి పాత బెల్లం కలిపి ఉదయం,సాయంత్రం తింటూ ఉంటే 15 రోజుల్లో శీతపిత్తం తగ్గుతుంది.
5) పుదిన,పాత చింతపండు దంచి ఆ పేస్టు శరీరానికి పూసి గంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

ఈ వ్యాధిలో ముఖం ఫై,పెదవుల ఫై వాపు వస్తుంటాయి ఆ వాపుల ఫై కూడా ఫై పేస్టు పూస్తే వాపు తగ్గుతుంది.

Thursday, November 25, 2010

పెదవులకు ఆయుర్వేద అధరలేపనం :
అధరలేపననికి కావలసిన పదార్దాలు : 
జాజికాయ పొడి - 10 గ్రాములు.
పసుపు కొమ్ముల పొడి - 10 గ్రాములు.
ఆవు నెయ్యి - 10 గ్రాములు.
తేనె మైనం - 20 గ్రాములు.(తేనె మైనం ఎక్కువ సేపు మంట ఫై ఉంటె అది మండుకుంటుంది.కాబట్టి జాగ్రతగా సన్న మంట ఫై వేడి చేయాలి.)
అధరలేపనం తయారుచేయడం:
1 )  పెనంలో తేనె మైనం,నెయ్యి వేసి సన్నని మంట ఫై కరిగించి వడబోసుకుని దానిలో జాజికాయ పొడి,పసుపు కొమ్ముల పొడి వేసి బాగా కలిపి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.ఈ అధరలేపనాన్ని రోజూ పడుకునే ముందు పెదవులకు రాసుకోవడం వల్ల పెదవులు పగలవు.ఈ లేపనం నోట్లోకి పోయినా పర్వాలేదు.
2 ) రోజూ పడుకునే ముందు రెండు చుక్కలు ఆవనూనె బొడ్డులో వేసుకుని మర్దన చేయడం వల్ల పెదవులు ఎరుపు రంగులోకి మారతాయి.ఈ విధంగా 100 రోజులు వరసగా చేయాలి.
గాయాలను మాన్పే ఆయుర్వేద శక్తి తైలం :
100 g వేపాకులు తీసుకుని నీరు పోస్తూ పేస్టు చేయాలి.ఈ వేపముద్దకు 1 /2 లీటరు నీరు కలిపి సన్నని మంట ఫై మరిగించి 100 గ్రాముల వేపకషాయం మిగిలాక వడబోయాలి.ఇలా తయారుచేసుకున్న 100 గ్రాముల  వేపకషాయంలో 20 గ్రాముల ఆవనూనె కలిపి సన్నని మంట ఫై మరిగించి అందులోని నీరు ఆవిరై నూనె మిగిలాక వడబోసుకుని గాజు సీసాలో నిల్వచేసుకోవాలి.ఈ తైలం ను పుండ్లకు,గాయాలకు పూయడం వల్ల ఇన్ఫెషన్ రాకుండా,చీము పట్టకుండా గాయాలు మానిపోతాయి.మొటిమలకు,శరీరంలో ఎక్కడ మచ్చలు ఉన్న ఈ తైలం పూయడం వల్ల అవి తగ్గిపోతాయి.
అరచేతిలో పుండ్లకు ఆయుర్వేద కానుక :
సబ్బులలోని కెమికల్స్ వల్ల కాళ్ళలో,చేతుల్లో పుండ్లు అయ్యి చర్మం పొరలుగా ఊడిపోతుంది .
ఎండిన కాకరకాయ పొడి,పసుపు,నిప్పుల ఫై పొంగించిన వెలిగారం,కర్పూరం అన్నింటిని పొడి చేసుకుని గాజు సీసాలో నిల్వచేసుకోవాలి.పడుకునే ముందు తగినంత పొడిలో నీరు కలిపి పేస్టు చేసి చేతులకు,కాళ్ళకు పూసుకుని ఉదయం నీటితో లేదా కూకుడుకాయరసంతో శుబ్రం చేసుకోవాలి.సబ్బు వాడకూడదు.వెలిగారం దొరక్కపోతే వేయకున్నా పర్వాలేదు.






 
చుండ్రు తగ్గటానికి ఆయుర్వేద ఔషదం :
100 g వేపనూనెలో,20 g ముద్దకర్పురం కలిపి వేడి చేసి వెంట్రుకల కుదుళ్ళకు పట్టించాలి.10 నిమిషాల తరువాత తాజా నిమ్మరసం కుదుళ్ళకు పట్టించాలి.10 నిమిషాల తరువాత ముందురోజూ రాత్రి నానబెట్టుకున్న 50 g మెంతులు,50 g ఉసిరికాయ పలుకులు ,కొంచం పెరుగు కలిపి పేస్టు చేసి కుదుళ్ళకు పట్టించాలి.అరగంట తరువాత ఈ పేస్టు తోనే వెంట్రుకలు రుద్ది తలస్నానం చేయాలి.షాంపూ వాడకూడదు.వెంట్రుకలు ఆరిన తరువాత కొబ్బరి నూనె లేదా ఆముదం వేడి చేసి మాడుకు మర్దన చేయాలి.ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడంవల్ల చుండ్రు తగ్గుతుంది.
చుండ్రు తగ్గటానికి చేయవలసిన యోగాసనాలు:
1 ) అర్ధశీర్షద్విహస్తఉత్తాసనం.
2 ) కుంబక ప్రాణాయామం .
ఆరోగ్యానికి విటమిన్ "ఇ" ఎంతో మేలు :
1 ) విటమిన్ "ఇ " అందానికి,ఆరోగ్యానికి ఎంతో అవసరం.
2 ) ఆకుకూరలు,పొద్దుతిరుగుడు,నట్స్,టమాటా,గుమ్మడికాయ,చిలగడదుంప,రాక్ ఫిష్,బొప్పాయి,బ్రొకోలి వంటి వాటిల్లో విటమిన్ "ఇ" సమృద్ధిగా లభిస్తుంది.
3 ) విటమిన్ "ఇ" కి కొవ్వు  కరిగించే శక్తి  ఉంది కాబట్టి ఉబకాయులు విటమిన్ "ఇ" ఉన్న ఆహారం తీసుకోవాలి.
4 ) విటమిన్ "ఇ" లో యాంటిఆక్సిడెంట్లు అధికం.అవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి.అంతేకాదు శరీరంలోని ప్రిరాడికల్స్ ను దూరం చేస్తాయి.క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి.రోగనిరోధక శక్తిని పెంచుతాయి.మతిమరుపు సమస్య ఉండదు.ఈ విటమిన్ చూపు స్పష్టతకు కూడా తోడ్పడుతుంది.
5 ) విటమిన్"ఇ" కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.రక్తకణాల వృద్ధికి తోడ్పడుతుంది.రక్త నాళాలలో రక్త ప్రసరణ సులువుగా జరుగుతుంది.
అంతే కాదు మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు వచ్చే సమస్యలను నివారిస్తుంది.
6 ) పొడిచర్మం గలవారు విటమిన్ "ఇ" లభించే పోషకాలు తీసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.అలానే దద్దుర్లు,దురద వంటి వాటిని తగ్గిస్తుంది.అతినీలలోహిత కిరణాల నుంచి శరీరాన్ని కాపాడుతుంది.
7 ) కీల్లనొప్పులను తగ్గిస్తుంది.కండరాలను ద్రుడపరుస్తుంది.కండరాలు తేలికగా కదలటానికి తోడ్పడుతుంది.ఎదిగే చిన్నారులకు,వయసు ఫై బడుతున్న  వారికీ విటమిన్ " ఇ " ఎక్కువగా ఇవ్వాలి.

Monday, November 8, 2010

కొత్తిమీరతో ఆరోగ్యం

1 ) కొత్తిమేరలో యాంటి ఆక్సిడెంట్లు  సమృద్దిగా లభిస్తాయి.
2 ) కొత్తిమిరలో ఉండే పోషకాలు జీర్ణ వ్యవస్థకు,రోగ నిరోధక శక్తికి  ఎంతో సాయపడతాయి.
3 ) కొత్తిమిరలో ఉండే డొడిసెనోల్ అనే పదార్ధం పేగుల్లో ఏర్పడే సాల్మొనెల్లా బ్యాక్టిరియా ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది.
4 ) గ్లాసుడు మజ్జిగలో చెంచా కొత్తిమిర రసం,చిటికెడు జీలకర్ర కలిపి తాగటం వల్ల శరిరానికి విటమిన్ 'A ', 'B 1 '  ,'B 2 ','C ',ఇనుము సమృద్ధిగా అంది శరీర నిర్మాణానికి,ఎముకల దృడత్వానికి,చర్మ సంరక్షణకు తోడ్పడతాయి.
5 ) అజీర్ణంతో బాధపడేవారు కొత్తిమిర  రసంలో జీలకర్ర,నిమ్మరసం,ఉప్పు కలిపి తాగాలి.
6 ) గర్భిణులు రోజూ రెండు చెంచాల కొత్తిమిర రసంలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల కడుపులో తిప్పడం,మలబద్ధకం వంటి సమస్యలు పోతాయి.
7 ) పేగు పూత ,కడుపులో మంట ఉన్నవారు కొత్తిమిరను పెరుగుతో కలిపి తినాలి.
8 ) నోటి దుర్వాసన,చిగుళ్ల సమస్యలు ఉన్నవారు కొత్తిమిర ఆకులు నమిలి మింగాలి.
9 ) కామెర్లు వచ్చినపుడు కొత్తిమిరను కూరల్లో వేసుకుని తినడం వల్ల త్వరగా కోలుకుంటారు.
10 ) కొత్తిమిర తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
11 ) ధనియాలను చారులాగా కాచి తాగడం వల్ల విరేచనాలు,జ్వరము తగ్గుతాయి.
12 ) నెలసరి సమయంలో అధికంగా ఋతుస్రావం అవుతుంటే ధనియాల కషాయాన్ని రోజుకి రెండు సార్లు పుచుకుంటే సమస్య నియంత్రణలో  ఉంటుంది .

చలి కాలంలో చర్మ రక్షణ

1 ) హెర్బల్ రకాలు ,కొవ్వులు అధికంగా ఉండే సబ్బులు వాడాలి.
2 ) గంట గంటకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
3) అలోవేర,కోకా,వెన్న,సన్ స్క్రీన్ లక్షణాలున్న ఆయుర్వేద నూనెలు రాసుకోవాలి.
 

Thursday, October 7, 2010

వెంట్రుకలు ఊడకుండ ఉండేందుకు ఆయుర్వేద షాంపు

కూకుడుకాయల  పొడి -100 g.
శీకాకాయ    పొడి - 100g.
ఉసిరికాయల పొడి  - 100g
మారేడు పండ్ల గుజ్జు పొడి - 100g
ఫై పొడులన్నీ బాగా కలిపి నిల్వచేసుకోవాలి.
గ్లాసు వేడి నీటిలో 6 స్పూన్ల పొడిని,ఒక నిమ్మకాయ రసంను వేసి బాగా కలిపి రాత్రంతా నానబెట్టి ఉదయం తల స్నానం చేయాలి.
ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేయాలి.ఏడు సార్లు చేసేటప్పటికి వెంట్రుకలు గట్టి పడి ఊడకుండ ఉంటాయి.
నువ్వుల ఉండలు,నువ్వుల పొడి,నువ్వులు ఆహారంలో  తీసుకోవడం వల్ల వెంట్రుకలు ఊడకుండ బాగా పెరుగుతాయి.