రేచీకటి సమస్య నివారణకు వ్యాస నయనామృతం:
1 ) 200 గ్రాముల అశ్వగంధ దుంపలను మునిగే వరకు పాలు పోసి మరిగిస్తూ పాలు ఇమిరాక ఎండబెట్టి పొడి చేసుకోవాలి .50 గ్రాములు పిప్పళ్ళ ను దోరగా వేయించి పొడి చేయాలి.
50 గ్రాముల ఉసిరికాయలు ఎండించి పొడి చేయాలి .
50 గ్రాముల తానికాయలను పొడి చేయాలి.
50 గ్రాముల కరక్కాయలు పొడి చేయాలి.
50 గ్రాముల చిన్న ఏలకులు పొడి చేయాలి.
అన్నీ కలిపి తగినంత తేనె వేసి నూరి ముద్ద చేసి నిల్వ చేసుకోవాలి.ఈ ముద్దను రాత్రి పడుకునే ముందు పిల్లలు సెనగగింజ సైజులో,పెద్దలు బటాణిగింజ సైజులో తినాలి. ఇలా ఆరు నెలలు చేస్తే ఎలాంటి కంటి సమస్యలైనా పోయి చూపు బాగా వస్తుంది.
రోజూ ఆహారంలో క్యారెట్,తెల్ల గలిజేరు,పొన్నగంటి ఆకూ,గుంటగలగరాకు,మునగాకు, ఒక సంవత్సరం నిల్వ ఉన్న ఉసిరి పచ్చడి తింటూ ఉండాలి.
2 ) సాయంత్రం మూడు తులసి ఆకులు తుంచి తడి గుడ్డలో ఉంచి ఆహారం తిన్న రెండు గంటల తరువాత పడుకోబోయే ముందు నోట్లో తులసిఅకులు వేసుకుని నమిలి ఆ పేస్టు ను చేత్తో తీసుకుని కంటి కి కాటుకలాగా పెడితే రేచీకటి పోతుంది.

No comments:
Write comments