1) వేడిగా ఉన్న నీటితో కాకుండా గోరువెచ్చగా ఉన్న నీటితో స్నానం చేయాలి.
2) శీతాకాలంలో మృతకణాల సమస్య అధికంగా ఉంటుంది కాబట్టి స్నానానికి ముందు ఉప్పు లేదా పంచదారతో సున్నితంగా మర్ధన చేయాలి.
3) పి హెచ్ అధికంగా ఉన్న సబ్బులు చర్మం పోడిబారేట్లు చేస్తాయి కాబట్టి కొవ్వులు అధికంగా ఉన్న సబ్బులు వాడుతూ గ్లిజరిన్ ఉన్న క్లెన్సర్ తో ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల రోజంతా ముఖం తాజాగా ఉంటుంది.
4) ఒమేగా త్రీ ఉన్న ఆహారం తీసుకోవాలి.
5) శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా నీటిని తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.
6) స్వచమైన కొబ్బరి నూనె శరీరానికి రాసుకోవడం వల్ల చర్మానికి తేమ అంది దురదలు రాకుండా ఉంటాయి.
7) స్నానం చేసే నీటిలో నాలుగైదు చుక్కలు బాదం నూనె లేదా ఆలివ్ నూనె కలిపి స్నానం చేయాలి.
8) స్నానం చేసి చర్మం తడిపొడిగా ఉండగానే బేబీ ఆయిల్ రాసుకోవాలి.
9) పొడి బారిన పెదాలకు లిప్ బామ్ రాయాలి.
10) ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చెంచా నిమ్మరసం కలిపి తాగడం వల్ల చర్మంలో వ్యర్ధాలు తొలగుతాయి.

No comments:
Write comments