amazon-3

Tuesday, January 25, 2011

రేచీకటి సమస్య నివారణకు వ్యాస నయనామృతం


రేచీకటి సమస్య నివారణకు వ్యాస నయనామృతం:

1 ) 200 గ్రాముల అశ్వగంధ దుంపలను మునిగే వరకు పాలు పోసి మరిగిస్తూ పాలు ఇమిరాక ఎండబెట్టి పొడి చేసుకోవాలి .
50 గ్రాములు పిప్పళ్ళ ను దోరగా వేయించి పొడి చేయాలి.
50 గ్రాముల ఉసిరికాయలు ఎండించి పొడి చేయాలి .
50 గ్రాముల తానికాయలను  పొడి చేయాలి.
50 గ్రాముల కరక్కాయలు పొడి చేయాలి.
50 గ్రాముల చిన్న ఏలకులు పొడి చేయాలి.
అన్నీ కలిపి తగినంత తేనె వేసి నూరి ముద్ద చేసి నిల్వ చేసుకోవాలి.ఈ ముద్దను రాత్రి పడుకునే ముందు  పిల్లలు సెనగగింజ సైజులో,పెద్దలు  బటాణిగింజ సైజులో తినాలి. ఇలా ఆరు నెలలు చేస్తే ఎలాంటి కంటి సమస్యలైనా పోయి చూపు బాగా వస్తుంది.
రోజూ ఆహారంలో క్యారెట్,తెల్ల గలిజేరు,పొన్నగంటి ఆకూ,గుంటగలగరాకు,మునగాకు, ఒక సంవత్సరం నిల్వ ఉన్న ఉసిరి పచ్చడి తింటూ ఉండాలి.
2 ) సాయంత్రం మూడు తులసి ఆకులు తుంచి తడి గుడ్డలో ఉంచి ఆహారం తిన్న రెండు గంటల తరువాత పడుకోబోయే ముందు నోట్లో తులసిఅకులు వేసుకుని నమిలి ఆ పేస్టు ను  చేత్తో  తీసుకుని కంటి కి కాటుకలాగా పెడితే రేచీకటి పోతుంది.

పులిపిర్ల సమస్యకు ఆయుర్వేద కానుక


పులిపిర్ల నివారణకు కానుక:

 

1 ) రావి చెట్టు ఫై బెరడును కాల్చి బూడిద చేసి సున్నపు నీరు తేటను కలిపి నిల్వచేసుకుని తగినంత మిశ్రమంలో కొద్దిగా  నెయ్యి వేసి సాది పులిపిరి ఫై పుస్తూ ఉంటే అవి రాలిపోతాయి.
2 ) చిటికెడు అతిమధురం పొడి,చిటికెడు అశ్వగంధ  పొడి, రెండు చుక్కలు కొబ్బరి నూనె  ,రెండు చుక్కలు నిమ్మరసం వేసి బాగా కలిపి అల్లంను పుల్లలగా సన్నగా కట్ చేసుకుని ఈ అల్లం పుల్లతో ఫై పేస్టు ను తీసుకుని పులిపిరి ఫై  రాయాలి.

Wednesday, January 19, 2011

శీతాకాలంలో చర్మానికి తీసుకోవలసిన జాగ్రతలు


1) వేడిగా ఉన్న నీటితో  కాకుండా గోరువెచ్చగా ఉన్న నీటితో స్నానం చేయాలి.
2) శీతాకాలంలో మృతకణాల సమస్య అధికంగా ఉంటుంది కాబట్టి స్నానానికి ముందు ఉప్పు లేదా పంచదారతో సున్నితంగా మర్ధన చేయాలి.
3) పి హెచ్ అధికంగా ఉన్న సబ్బులు చర్మం పోడిబారేట్లు చేస్తాయి కాబట్టి కొవ్వులు అధికంగా ఉన్న సబ్బులు వాడుతూ గ్లిజరిన్ ఉన్న క్లెన్సర్ తో ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల రోజంతా  ముఖం తాజాగా ఉంటుంది.
4) ఒమేగా త్రీ ఉన్న ఆహారం తీసుకోవాలి.
5) శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా నీటిని తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.
6) స్వచమైన కొబ్బరి నూనె శరీరానికి రాసుకోవడం వల్ల చర్మానికి తేమ అంది దురదలు రాకుండా ఉంటాయి.
7) స్నానం చేసే నీటిలో నాలుగైదు చుక్కలు బాదం నూనె లేదా ఆలివ్ నూనె కలిపి స్నానం చేయాలి.
8) స్నానం చేసి చర్మం తడిపొడిగా ఉండగానే బేబీ ఆయిల్ రాసుకోవాలి.
9) పొడి బారిన పెదాలకు లిప్ బామ్ రాయాలి.
10) ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చెంచా నిమ్మరసం కలిపి తాగడం వల్ల చర్మంలో వ్యర్ధాలు తొలగుతాయి.

Tuesday, January 18, 2011

సత్తువనిచ్చి సంజివనిలా పనిచేసే కాల్షియం

Calcium
1 ) ఒక గ్లాస్ పాలు తాగితే చిన్నారులకు,గర్భినిలకు సరిపడిన కాల్షియం అందుతుంది.
2) టీనేజ్ వయసు వారికి కాల్షియం ఉన్న ఆహారం ఇవ్వడం వల్ల ఎముకల సాంద్రత పెరిగి భవిష్యత్ లో చలాకీగా,చురుగ్గా ఉంటారు.
3) పావుగంట పాటు ఎండలో నిల్చున్నా కాల్షియం అందుతుంది.
4) మెనోపాజ్ దాటిన తర్వాత మహిళల్లో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గి ఎముకల సాంద్రత తగ్గుతుంది.ఇలా కాకుండా ఉండాలంటే చిన్న వయసు నుండే కాల్షియం ఉన్న ఆహారం తీసుకోవాలి.
5) వారానికి మూడు రోజులు వ్యాయామం చేయడం వల్ల శరీరానికి కావలిసిన కాల్షియం ఆహారం నుండి అందుతుంది.
6) ఆహారం నుంచి కాల్షియం సరిగా అందకుండా పోతుంటే మాత్రం ఉప్పు వాడకాన్ని తగ్గించాల్సి ఉంటుంది.
7)బీన్స్,రాజ్మా,కాబూలిసెనగలు,టోపు,పాలకూర,రాగులు,పెసలు,మినపప్పు,సెనగపప్పు,సోయాబీన్,తోటకూర,తమలపాకు
కొత్తిమీర, కర్వేపాకూ,మునక్కాడలుమెంతికూర,పుదిన వంటి వాటిలో కాల్షియం ఉంటుంది.వీటినిఆహారంతీసుకోవడం వల్ల కాల్షియం లోపాన్ని నియంత్రించుకోవచ్చు.
8) పచ్చళ్ళు ,ఉప్పు ఎక్కువగా ఉన్న స్నాక్స్,అప్పడాలు,శీతల పానీయాలు తీసుకోకూడదు.వీటిలో ఉండే సోడియం శరీరానికి కాల్షియాన్ని అందకుండా చేస్తుంది.
9) టీ,కాపీలు తాగే వారికి కాల్షియం తగ్గుతుంది.
10) సోయా బీన్స్,బాదం,ఎండు ద్రాక్ష,వేరుసెనగలు,యాపిల్ పండ్లలో బోరాన్ ఉంటుంది.బోరాన్ లభించే   ఆహారం తినడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది.
11) 65 ఏళ్ళ వారు కాల్షియం సప్లిమెట్లని,కాల్షియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఎముకలు విరగకుండా నివారించవచ్చు.

Monday, January 10, 2011

చేతి గోళ్ళు అందంగా,ఆరోగ్యంగా పెరగటానికి చిట్కాలు

nails


       మృదువైన బ్రష్ తో గోళ్ళలోని  మట్టి,క్రిములు శుభ్రం చేసుకోవాలి.
ఇంటి పనులు పూర్తి చేసిన తరువాత చేతులు తుడుచుకుని మాయిశ్చరైజర్ రాయాలి.
నీళ్ళలో ఎక్కువ సమయం పనిచేయాల్సినప్పుడు చేతులకు గ్లవుజులు ధరించాలి.
రసాయనాలకు,తేమకు దూరంగా ఉంచాలి.
గోళ్ళకు రంగు వేసుకున్నాక ఫైన పొరలా జిగురును వేసుకోవాలి.
నెయిల్ పాలిష్ రిమూవర్ ను 15 రోజులకోసారి వాడాలి.లేకపోతే గోళ్ళు పెళుసుగా మారి దెబ్బతింటాయి.
మెనిక్యుర్ చేసిన వెంటనే వేళ్ళను తువాల్ తో తుడిచేయాలి.
రోజు మార్చి రోజు గోళ్ళకు కొబ్బరి నూనె లేదా ఆముదం రాస్తే ఆరోగ్యంగా ఉంటాయి.

బ్లాక్ హెడ్స్ నివారణకు చిట్కాలు :

Black heads
1) 4 కప్పుల వేడి  నీటికి రెండు స్పూన్ల సోడా బైకార్బోనేట్ కలిపి ఆ నీటిలో టవల్ ముంచి టవల్ని ముఖం ఫై ఉంచుకోవాలి.ఇలా ఐదారుసార్లు చేయాలి.ఇప్పుడు ఒక స్పూన్ పెరుగులో ఒక స్పూన్ బియ్యం పిండిని కలిపి ముఖానికి పూసి బ్లాక్ హెడ్స్ ఉన్నచోట రుద్దాలి.ఆరిన తర్వాత చల్లటినీటితో కడుక్కోవాలి.
2) ఓట్ మీల్ పౌడర్ లో రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడుక్కోవాలి.
3 ) మెంతి ఆకులు పేస్టు చేసి రోజూ రాత్రులు ముఖానికి పూసి 15 నిమిషాలకు కడుక్కోవాలి.ఇలా కొన్ని రోజులు చేస్తే బ్లాక్  హెడ్స్ పోతాయి.
4 ) పెరుగులో నల్ల మిరియాల పొడి కలిపి ముఖానికి పూసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి.
5 ) తాజా కొత్తిమీర రసంలో పసుపు కలిపి రాత్రి ముఖానికి పూసి ఉదయం కడుక్కోవాలి.ఇలా ఓ వారం చేస్తే బ్లాక్ హెడ్స్ పోతాయి.
6 ) ద్రాక్ష పండ్ల గుజ్జును బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాసి ఆరిన తర్వాత గోరువెచ్చటి  నీటితో కడుక్కోవాలి.
7 ) నిమ్మరసంలో దాల్చిన చెక్క పొడి కలిపి రాత్రి ముఖానికి పూసి ఉదయం కడుక్కోవాలి.
8 ) పొట్లకాయ గుజ్జును ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు,ముడుతలు,వైట్ హెడ్స్,బ్లాక్ హెడ్స్ రాకుండా ఉంటాయి .

Friday, November 26, 2010

Strong Body

 దేహదారుడ్యానికి విశ్వామిత్ర ఆయుర్వేద చూర్ణం:

అశ్వగంధ - 100 g ( వీటిని  పాలల్లో వేసి మరిగించాలి.పాలు ఆవిరైపోయాక ఎండబెట్టి పొడి చేయాలి.)
అతిమధురం - 50 g (వీటిని పాలల్లో వేసి మరిగించాలి.పాలు ఆవిరైపోయాక ఎండబెట్టి పొడి చేయాలి.)
సొంఠి - 25 g ( వీటిని 5 చుక్కలు నూనె వేసి వేయించి పొడి చేయాలి.)
కలకండ పొడి - 175 g .
ఫై పొడులన్నింటిని జల్లించి గాజు సీసాలో నిల్వచేసుకోవాలి.గ్లాస్ గోరువెచ్చని పాలల్లో ఒక స్పూన్ పొడి వేసి తాగాలి.(1/4 స్పూన్ నుంచి ఒక స్పూన్ వరకు పెంచాలి.పిల్లలకు ఇంకా తక్కువ పొడి వేయాలి.)
దీనివల్ల స్త్రీలకు బహిస్టు సక్రమంగా వస్తుంది.గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్ తగ్గుతాయి.వాత,కఫ,పిత్త సంబంధ వ్యాధులు తగ్గుతాయి.
నీరసం పోతుంది.మోకాళ్ళ నొప్పులు పోతాయి.పిల్లలకు,పెద్దలకు మంచి దేహదారుడ్యాన్ని ఇస్తుంది.యువతీ,యువకులకు యవ్వనాన్ని ఇస్తుంది.
Health tips

తెల్ల బొల్లి మచ్చలకు ఆయుర్వేద ఔషదం :

ఒక గిన్నెలో 10 గ్రాముల ఉసిరికాయలు,10 గ్రాముల కాచు,1 /2 లీటరు నీరు పోసి సన్నని మంట ఫై 1 /4 లీటరు కషాయం మిగిలేవరకు మరిగించి 1 / 4 స్పూన్ బావంచాలు వేసి స్టవ్ ఆఫ్ చేసి వడబోసుకోవాలి.వడబోసుకున్న నీటిని ఉదయం సగం,సాయంత్రం సగం గోరువెచ్చగా తాగాలి.
ఈ నీరు తాగినంత కాలం మాంసం,గుడ్లు,చేపలు,పాలు,పెరుగు,వెన్న తినకూడదు.అతి పులుపు తినకూడదు.పాల ఉత్పత్తులతో మాంసం ఉత్పత్తులు కలిపి తినడం వల్ల చర్మవ్యాధులు వస్తాయి.
రాలిపోయిన జుట్టు తిరిగి రావడానికి ఆయుర్వేద కానుక :
100 గ్రాముల ముల్లగి దుంపల రసం,100 గ్రాముల  గుంటగలగరాకు రసం,100 గ్రాముల ఉల్లిపాయల రసం.100 గ్రాముల పుదినా రసం,100 గ్రాముల పల్లేరు కాయల రసం,500 గ్రాముల నువ్వుల నూనె వేసి సన్నని మంట ఫై మరిగించాలి.నీరు ఇమిరిపోయి నూనె మిగిలాక గాజు సీసాలో నిల్వచేసుకోవాలి.జుట్టుకు పెట్టుకునే ముందు గోరువెచ్చగా చేసి కుదుళ్ళకు మర్దన చేయాలి.కళ్ళు మూసుకుని రాలిపోయిన జుట్టు తిరిగి వస్తున్నట్లుగా భావన చేయాలి.ప్రతి రోజూ సర్వాంగాసనం వేయాలి.
మొటిమల (యవ్వన పిటికలు ) నివారణకు ఆయుర్వేద ఔషధాలు :
బహిస్టు సక్రమంగా రాకుంటే మొటిమలు వస్తాయి.మలబద్ధకం ఉన్నామొటిమలు వస్తాయి.రక్తం పరిశుభ్రంగా  లేకున్నా మొటిమలు వస్తాయి.కాబట్టి ఫై సమస్యలు లేకుండా చూసుకోవాలి. 
1 ) జాజికాయ,చందనం తగినంత నీటితో పేస్టు చేసి రాత్రి ముఖానికి పూసి ఉదయం గోరువెచ్చటి నీటితో కడగాలి.
2 ) ఒక స్పూన్ మంజిష్ట,ఒక స్పూన్ తేనె కలిపి పేస్టు చేసి మొటిమలకు పూస్తే మొటిమలు,మచ్చలు పోయి ముఖం అందంగా ఉంటుంది.